నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఏటా క్రమం తప్పకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్న సంస్థ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి). రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే, జీత భత్యాలు, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు, ప్రమోషన్‌ పాలసీ తదితర అంశాలు మెరుగ్గా ఉండటంతో ఏటా ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌(సిహెచ్‌ఎస్‌ఎల్‌, 10+2) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో మొత్తం ఖాళీల సంఖ్య పేర్కొనలేదు. అయితే, గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి వీటి సంఖ్య 3259 వరకు ఉండవచ్చనేది అంచనా. అధికారిక ఖాళీల వివరాలను మాత్రం ఎస్‌ఎ్‌ససి త్వరలో తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.
ఉద్యోగాలు
-పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్స్‌(పిఎ/ఎ్‌సఎ)
-డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డిఇఒ)
-లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌(ఎల్‌డిసి)/జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేలు
-లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌: పే బ్యాండ్‌-1 (రూ.5,200-రూ.20,200), గ్రేడ్‌ పే: రూ.1900 (ప్రి రివైజ్డ్‌)
-పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌: పే బ్యాండ్‌-1(రూ.5,200-రూ.20,200), గ్రేడ్‌ పే: రూ.2400(ప్రి రివైజ్డ్‌)
-డేటా ఎంట్రీ ఆపరేటర్‌: పే బ్యాండ్‌-1(రూ.5,200- రూ.20,200), గ్రేడ్‌ పే:రూ.2400 (ప్రి రివైజ్డ్‌)
-డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎ:పే బ్యాండ్‌-1(రూ.5,200- రూ.20,200), గ్రేడ్‌ పే:రూ.2400 (ప్రి రివైజ్డ్‌)
వయోపరిమితి, అర్హతలు
ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎల్‌డిసి/జెఎ్‌సఎ, పిఎ/ఎ్‌సఎ, డిఇఒ(సి అండ్‌ ఎజిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు మినహా) ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌(కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేసేవారు) మేథ్స్‌ ప్రధాన సబ్జెక్టుగా సైన్స్‌ స్ర్టీమ్‌లో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
ఏప్రిల్‌ 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. అవి... టైర్‌-1 (కంప్యూర్‌ బేస్డ్‌ ఎగ్జామినే), టైర్‌-2(డిస్ర్కిప్టివ్‌ పేపర్‌), టైర్‌-3(స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌)

ప్రిపరేషన్‌
బేసిక్‌ ఇంగ్లీష్‌: అభ్యర్థి ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీ్‌షలో రాణించాలంటే వ్యాకరణంపై కనీస పరిజ్ఞానం అవసరం. కాంప్రహెన్షన్‌, వొకాబులరి, ఆంటోనిమ్స్‌, సినోనిమ్స్‌, వర్బ్స్‌, టెన్సెస్‌, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూ షన్స్‌, ప్రిపోజిషన్స్‌, క్వశ్చన్‌ ట్యాగ్స్‌, ప్యాసేజెస్‌ వంటి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. ఆంగ్ల పత్రికలను చదవాలి. క్లిష్టమైన పదాలకు అర్థం తెలుసుకోవాలి.
జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ అండ్‌ నావెర్బల్‌ ప్రశ్నల మిళితమే జనరల్‌ ఇంటెలిజెన్స్‌. అంటే అభ్యర్థులు బేసిక్‌ మేథ్స్‌పై అవగాహనను పెంచుకోవాలి. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్‌ స్థాయిలోనే ఉంటాయి. కూడికలు, తీసివేతలు, గుణాంకాలు, భాగహారంపై పట్టుసాధిస్తే ఈ విభాగంలో సులభంగా మార్కులు తెచ్చుకోవచ్చు. సంఖ్యామానం, సరాసరి, భాగస్వామ్యం, శాతాలు, లాభ నష్టాలు, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, కాలం-పని, క్లాక్స్‌ అండ్‌ క్యాలెండర్స్‌, మెన్సురేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంట్రప్రిటేషన్‌, పజిల్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌ వంటి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. అప్పుడే క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌, అనలిటికల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు సులువుగా చేయవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో మంచి మార్కులు రావాలంటే అంతర్జాతీయ, జాతీయ సదస్సులు, అవార్డులు, బహుమతులు, క్రీడలు, విజేతలు, ప్రధాన నియామకాలు, ప్రముఖుల మరణాలు, పర్యటనలు వార్తల్లోని వ్యక్తులు, శాస్త్ర సాంకేతిక విశేషాలు, క్షిపణులు వంటి అంశాలను అధ్యయనం చేయాలి. వీటికోసం ప్రతి రోజూ వార్తా పత్రికలను తప్పనిసరిగా చదువుతూ అంశాల వారీగా నోట్సు రాసుకోవాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 5, 2019.
టయర్‌-1 రాత పరీక్షలు: జూలై 1 - 26 వరకు
టయర్‌-2 నిర్వహణ తేదీ: సెప్టెంబర్‌ 29, 2019
తెలుగు రాష్ర్టాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
వెబ్‌సైట్‌: http://ssc.nic.in/

పరీక్ష స్వరూపం
టయర్‌-1: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ ఆధారిత పరీక్ష. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. 200 మార్కులకు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. బేసిక్‌ ఇంగ్లీష్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి 25, క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌(బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్‌) నుంచి 25, జనరల్‌ ఆవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.50 మార్కు కట్‌ చేస్తారు. టయర్‌-1లో అర్హత సాధించిన వారిని టయర్‌-2 పరీక్షకు అనుమతిస్తారు.
టయర్‌-2: ఇది పెన్‌, పేపర్‌ ఆధారిత పరీక్ష. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి 100 నిమిషాలు. అభ్యర్థులు ప్రశ్నకు సమాధానాన్ని 200 నుంచి 250 పదాలలో రాయాల్సి ఉంటుంది. అదే విధంగా లెటర్‌/ఆపికేషన్‌ను 150 నుంచి 200 పదాల్లో ముగించాలి. ఈ పరీక్షలో సాధించాల్సిన కనీస అర్హత మార్కులు 33 శాతం.

టయర్‌-3(స్కిల్‌/టైపింగ్‌ టెస్ట్‌): డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టు కోసం టయర్‌-3లో భాగంగా స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఈ టెస్ట్‌లో 60 నిమిషాల్లో 8 వేల పదాల (కీ డిప్రెషన్స్‌)ను వేగంగా కంప్యూటర్‌లో ఎంటర్‌ చేసే నైపుణ్యం ఉండాలి. అదేవిధంగా 2000 - 2200 పదాలతో ఉండే ఇంగ్లీష్‌ ప్యాసేజ్‌ను 15 నిమిషాల్లో కంప్యూటర్‌లో టైప్‌ చేయాలి. కంపో్ట్రల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు దరఖాస్తు చేసుకున్న వారు 60 నిమిషాల్లో 15 వేల పదాల (కీ డిప్రెషన్స్‌)ను వేగంగా కంప్యూటర్‌లో ఎంటర్‌ చేసే నైపుణ్యం ఉండాలి. అదేవిధంగా 3700 - 4000 పదాలతో ఉండే ఇంగ్లీష్‌ ప్యాసేజ్‌ను 15 నిమిషాల్లో కంప్యూటర్‌లో టైప్‌ చేయాలి. ఎల్‌డీసీ / జేఎ్‌సఏ / పీఏ / ఎస్‌ఏ పోస్టులకు నిర్వహించే టైపింగ్‌ టెస్ట్‌ ఇంగ్లీష్‌ / హిందీ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు ఈ రెండు భాషల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తు సమయంలోనే వెల్లడించాలి. ఇంగ్లీష్‌ భాషను ఎంచుకున్న వారు నిమిషానికి 35 పదాల వేగం, హిందీ భాషలోనైతే నిమిషానికి 30 పదాల వేగంతో టైప్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మొత్తమ్మీద గంటకు 9000 - 10500 పదాలను ఎంటర్‌ చేయగలగాలి. అదేవిధంగా ఇచ్చిన ఇంగ్లీష్‌ ప్యాసేజ్‌ను 10 నిమిషాల్లో ఎంటర్‌ చేయాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)