విమాన కూలి 157 మంది దుర్మరణం.. మృతుల్లో గుంటూరు అమ్మాయి

ఇథియోపియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8’ విమానం ఆదివారం ఉదయం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 157 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏపీలోని గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా, పర్యావరణ శాఖ సలహాదారు శిఖా గార్గ్‌ సహా నలుగురు భారతీయులు ఉన్నారు. అడిస్‌ అబాబా విమానాశ్రయం నుంచి కెన్యాలోని నైరోబీకి బయలుదేరిన 6 నిమిషాలకే (స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44గంటల సమయంలో) బిషోఫ్టు పట్టణం పరిసరాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో కెన్యా, ఇథియోపియా, కెనడా, చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఈజిప్టు, నెదర్లాండ్‌, స్లొవేకియా, భారత్‌కు చెందినవారు ఉన్నారు. కుప్పకూలిన విమాన శకలాలను తమ సంస్థ సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం పరిశీలిస్తున్న ఓ ఫొటోను విడుదల చేసింది. ఇదే విషయమై సీఈఓ టెవోల్డే విలేకరులతో మాట్లాడారు. ‘ఇబ్బందిగా ఉంది.. ముందుకెళ్లే పరిస్థితి లేదు.. వెనక్కి వచ్చేస్తాం’ అంటూ కంట్రోల్‌ రూమ్‌కు పైలట్‌ సందేశం పంపాడన్నారు.

అందుకు కంట్రోల్‌ రూమ్‌ నుంచి వెంటనే అనుమతులు ఇచ్చినప్పటికీ.. విమానం కూలిపోయిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్‌ కార్యాలయం ట్వీట్‌ చేసింది. కొద్ది నిమిషాల ముందే విమానం ఎక్కిన తమవారు ఇక లేరని తెలుసుకొని ప్రయాణికుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ 737 భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కం పెనీ విమానం 2018 అక్టోబరు 29న జావా సముద్రంలో కుప్పకూలి 189 మంది జలసమాధి అయ్యారు.

మృతుల్లో తెలుగమ్మాయి
ఇథియోపియా విమాన ప్రమాద ఘటనలో మృతిచెందిన నలుగురు భారతీయుల వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. మృతుల్లో పర్యావరణ- అటవీ శాఖ కన్సల్టెంట్‌ శిఖా గార్గ్‌, నూకవరపు మనీషా, వైద్యహన్సిన్‌, వైద్య పన్నగేష్‌ భాస్కర్‌ అనే నలుగురు భారతీయులు ఉన్నట్లు తెలిపారు. కెన్యా రాజధాని నైరోబీలో జరగనున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రా జెక్టు సదస్సులో పాల్గొనేందుకు శిఖాగార్గ్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాల కు అవసరమైన దౌత్యసాయం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)