అజిత్‌కు అది సెంటిమెంట్‌గా మారిపోయింది..

తమిళ సూపర్‌స్టార్ అజిత్‌ తన కుమారుడు చరణ్ దుస్తులు వేసుకునేవాడని అంటున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అజిత్‌, చరణ్ రూం మేట్స్‌. ఓ రకంగా చెప్పాలంటే అజిత్‌కు సినిమాల్లో అవకాశం ఇప్పించింది బాలసుబ్రహ్మణ్యమే. అయితే ఓ పాటల కార్యక్రమంలో అజిత్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని బాలసుబ్రహ్మణ్యం అభిమానులతో పంచుకున్నారు. ‘చరణ్‌, అజిత్‌ కలిసే చదువుకున్నారు. ఒకే రూంలో ఉండేవారు. అజిత్ సినీ కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో యాడ్‌ షూట్స్‌కు చరణ్‌ దుస్తులు వేసుకెళ్లేవాడు. అది తనకు సెంటిమెంట్‌గా మారిపోయింది. నేను నిర్మించిన చిత్రంతోనే అజిత్‌ తన కెరీర్‌ను ప్రారంభించాడు. నాకు అజిత్‌లో నచ్చే విషయం ఏంటంటే.. అనవసరమైన మ్యాగజైన్‌లకు, టీవీ కార్యక్రమాలకు అజిత్‌ ఇంటర్వ్యూలు ఇవ్వడు. అజిత్‌కి ఒకప్పుడు రేసింగ్‌ అంటే ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు తన ఆలోచనలన్నీ సినిమాలపైనే’ అని వెల్లడించారు. ఆయన ఏ సందర్భంలో అజిత్‌ను గుర్తుచేసుకున్నారో తెలియరాలేదు కానీ.. అజిత్‌ గురించి మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)