‘మా’ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

తెలుగు సినీనటుల సంఘం (మా) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించారు. ఈ ఎన్నికల్లో నటులు నరేశ్‌, శివాజీ రాజా ఆధ్వర్యంలోని ప్యానళ్లు మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ‘మా’ అసోసియేషన్‌లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా’ ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో తొలి ఓటును నటుడు నరేశ్‌ వేయగా.. చివరి ఓటును అలనాటి హాస్య నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు. సినీరంగానికి చెందిన ప్రముఖులంతా ఫిల్మ్‌ఛాంబర్‌కు వచ్చి ఓటేశారు. లెక్కింపు అనంతరం విజేతల వివరాలను ప్రకటించనున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)