అఫీషియల్ : విమాన ప్రమాదంలో అందరూ చనిపోయారు. విమానంలో ఉన్న 33 దేశాల‌కు చెందిన..

ఇథియోపియా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన బోయింగ్ 737 విమానం(ET 302) ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తుండగా ఈ పరమాదం జరిగిందని ఇథియోపియా ప్రధాని కార్యాలయం అఫీషియల్ గా తెలిపింది. విమాన ప్రమాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాడ సానుభూతి తెలుపుతున్నట్లు ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 33 దేశాల‌కు చెందిన ప్ర‌యాణికులు మృతి చెందినట్లు ఇథియోపియా బ్రాడ్‌ కాస్టింగ్ కార్పొరేష‌న్ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. అడిస్ అబాబాలోని బోలె ఇంటర్నేషన్ ఎయిర్‌ పోర్ట్ నుంచి ఆదివారం ఉదయం 8:38గంటలకు విమానం గాల్లోకి లేచిందని.. ఆ తర్వాత కొంతసేపటికే 8:44 గంటలకే ప్రమాదానికి గురైందని గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, విమానం ఎక్కడ కుప్పకూలిందన్న వివరాలు ఇంకా తెలియలేదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)