ఆ 2 నిమిషాలు లేటయితే… దావూద్ అక్కడే ఖతమైపోయేవాడు..!!

ఇంత బలమైన కంట్రీ ఇండియా… ఆ దావూద్ ఇబ్రహీంను ఆ పాకిస్థాన్‌లోనే ఖతం చేయించలేకపోయిందా..? అసలు ఆ మసూద్ అజహర్‌ను పట్టుకురాలేదా..? ఆ ఇజ్రాయిలీ మొసాద్‌ను చూడండి, ఎంత పెద్ద తోపు అయినా, ఏ దేశంలో దాక్కున్నా సరే, కసిగా వేటాడి చంపేస్తుంది… (మొసాద్ గురించి మరో కథనంలో వివరంగా చెప్పుకుందాం… మోస్ట్ నొటోరియస్ ఆర్గనైజేషన్ అది) మరి మన ‘రా’కు ఎందుకు చేతకాదు..? ఇదుగో ఇలాంటి అభిప్రాయాలు బాగా వినిపిస్తుంటాయి… ఈమధ్య యుద్ధ ఉద్రిక్తతల నడుమ ఇంకాస్త ఎక్కువ వినిపించాయి… నిజమే… మనలో ఆ ‘వర్గ కసి’ లోపించింది… మన రాజకీయవేత్తలే దానికి కారణం… మన ఐబీ, ఎంఐ, రా తదితర సంస్థల్లో మెరికల్లాంటి వేల మంది ఏజెంట్లు ఉన్నా సరే, అన్నంలో మెరిగెల్లాంటి పొలిటిషియన్స్ వల్ల అనేకసార్లు ఏమీ చేయలేకపోవడం..! దావూద్, మసూద్ వంటి వాళ్లను కాపాడేది వాళ్ల సొంత తెలివితేటలకన్నా ఇండియా అంతర్గత శత్రువులే… 10 మంది దావూద్‌ను చంపటానికి రెడీ అయితే, 100 మంది తనను కాపాడటానికి, అడ్డుపడటానికి ఇండియాలోనే ముందుకొస్తారు… అదీ దుర్విధి…

దావూద్‌ను వేసేయటానికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఏడుసార్లు ప్రయత్నించినా… ప్రతిసారీ ఉన్నత స్థానాల్లో ఉన్న మన వాళ్ల నిర్వాకం వల్ల ఫెయిలయ్యాయి… చివరిసారిగా… 2013లో… దావూద్‌ను లేపేయటానికి రా ఓ ప్లాన్ వేసింది… ఈ ఆపరేషన్ కోసం 9 మంది కమెండోలను అద్దెకు మాట్లాడుకుంది… అంతర్జాతీయ వ్యవహారాల్లో అలాంటి కమెండో టీంలు బోలెడు దొరుకుతాయి… ఆ 9 మందికీ సూపర్ బాయ్స్ అని పేరు కూడా పెట్టింది… శిక్షణ ఇచ్చింది… సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది…

2013, సెప్టెంబరు 13… అదీ ముహూర్తం… కరాచీలో ఆపరేషన్… ఇజ్రాయిలీ ఇంటలిజెన్స్ మొసాద్ కూడా సాయం చేయటానికి ముందుకొచ్చింది… సూడాన్, బంగ్లాదేశ్, నేపాల్… ఇలా పలుదేశాలకు చెందిన రకరకాల ఫేక్ పాస్‌పోర్టులతో సూపర్ బాయ్స్ అందరూ అప్పటికే పాకిస్థాన్‌లో ప్రవేశించారు… దావూద్ కదలికలపై నిఘా వేశారు… రోజూ తను క్లిఫ్‌టన్ రోడ్డు నుంచి డిఫెన్స్ హౌజింగు సొసైటీ దాకా ఒకే సమయంలో వెళ్తుంటాడు… ఆ టైంలో పెద్దగా సెక్యూరిటీ కూడా ఉండదు… నిజానికి లైఫ్ థ్రెట్ ఉన్న అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ ఎవడూ ఒకే టైములో ఒకే దారిలో రోజూ వెళ్లడు… అది బ్లండర్… కానీ పాకిస్థాన్‌లో నన్నెవడు ఏం చేస్తాడు అనే ధీమా తనది… ఆ దారిలో ఉండే ఓ దర్గా దగ్గరే దావూద్‌కు స్పాట్ పెట్టాలని ఈ సూపర్ బాయ్స్ నిర్ణయం తీసేసుకున్నారు… ఇండియాలోని ‘బాస్’కు చెప్పారు… గో ఎహెడ్ అని జవాబు వచ్చింది…

సమయం వచ్చేసింది… ఆ తొమ్మిది మంది కమెండోలు ఎవరికి అప్పగించిన స్థానాల్లో వాళ్లు పొజిషన్లు తీసుకుని రెడీగా ఉన్నారు… పలు దశలు… ఒకచోట మిస్సయితే మరోచోట… టార్గెట్ తప్పించుకోవటానికి మాత్రం వీల్లేదు… అందరూ గన్ షూటింగులో రాటుదేలినవాళ్లే… అందరూ దావూద్ బాపతు వీడియోలను పలుసార్లు చూశారు కాబట్టి తన మొహం, తన కదలికలు, తన ఆకారం అందరి మెదళ్లలోనూ ముద్రపడిపోయింది… సో, టార్గెట్ విషయంలో పొరబడటానికి చాన్సే లేదు… గన్స్ గర్జించాక ఎవరెవరు ఏయే సేఫ్ ప్యాసేజీల్లో తప్పించుకోవాలో కూడా ఓసారి సరిచూసుకున్నారు… ఆపరేషన్ జరిగాక అక్కడ ఆవరించే కొన్ని నిమిషాల అయోమయావస్థలోనే స్కిప్పయిపోవాలి… దావూద్ బయల్దేరాడు… సూపర్ బాయ్స్ అలర్ట్ అయిపోయారు… తుపాకులు రెడీ… నిమిషంలోనో, రెండు నిమిషాల్లోనో ఇక తుపాకులు గర్జిస్తాయనుకున్న దశలో… ఈ సూపర్ బాయ్స్‌ను లీడ్ చేసే కమెండోకు ఫోన్ కాల్… అర్జెంట్ శాటిలైట్ ఫోన్ కాల్… ఇండియా నుంచి… స్టాప్ ది ఆపరేషన్…. ఇదీ ఆ కాల్ ఆదేశం… ఆ లీడర్ వెంటనే తన టీంకు ఆ సిగ్నల్స్ ఇచ్చాడు… కమెండోలు స్టన్నయ్యారు… దావూద్ సురక్షితంగా ఆ ప్రదేశం నుంచి రోజులాగే వెళ్లిపోయాడు… బూటు కాళ్లను నేలపై విసురుగా తన్నేస్తూ, తీవ్ర అసంతృప్తితో కమెండోలు వెనక్కి తిరిగారు… ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చింది..? ఎందుకు ఆపరేషన్ ఆపేశారు…? సమాచారం ఎలా లీకైంది..? రా మాజీ అధికారులు కూడా దీన్ని బయటికి ఇప్పటికీ వెల్లడించలేదు… అలాంటి కీలకమైన ఆపరేషన్ చివరి క్షణాల్లో ఆగిపోయిందీ అంటే అది అత్యున్నత స్థాయి వ్యక్తి నుంచి వచ్చిన స్ట్రిక్ట్ ఆర్డర్సే అయి ఉంటాయి కదా…? ఎవరా కీ పర్సన్..?! ఇది సరే, ఆరేడుసార్లు ప్రయత్నాలు అన్నారు కదా… అవేమిటి అంటారా..? అవీ చెప్పుకుందాం… మరో కథనంలో…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)