కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు?

కొత్తగా కట్టిన ఇంట్లో లేదా కొత్తగా అద్దె ఇంట్లోకి ప్రవేశించే సమయంలో పొయ్యిమీద పాలు పొంగించడం హైందవ సంప్రదాయం. పాలు పొంగిన ఇంట్లో అంతా శుభాలే జరుగుతాయని పెద్దలు చెబుతారు. దీని వెనక ఒక అర్థముంది. సకల సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భం నుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు శ్రీహరి స్థిరనివాసం కూడా క్షీరసాగరంమీదే. అలా దేవీదేవతలకు ఇష్టమైన పాలు కొత్త ఇంట పొంగితే అష్టైశ్వర్యాలూ, భోగభాగ్యాలూ, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధీ వెల్లివిరుస్తాయని నమ్ముతారు. అందుకే కొత్త ఇంట్లోకి చేరే సమయంలో ఇంటి యజమాని ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగించమని చెబుతాడు. ఆ పాలతో క్షీరాన్నాన్ని వండి వాస్తు పురుషుడికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల వాస్తు సంబంధ దోషాలు కూడా పరిహారమవుతాయని చెబుతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)