మూడేళ్ల కూతురి జననేంద్రియాలను కోసిన తల్లి

లండన్: ఉగాండాకు చెందిన మహిళకు బ్రిటన్ కోర్టు 13 ఏళ్ల జైలు శిక్షను విధించింది. మూడేళ్ల కూతురి జననేంద్రియాలను(ఫిమేల్ జెనిటల్ ముటిలేషన్) కోసిన నేరానికి కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 2017లో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కూతురికి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుండటంతో మహిళ తన కూతురిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఏమైందని డాక్టర్లు ప్రశ్నించగా.. వంట గదిలో పడిపోయినట్టు కట్టుకథలు అల్లింది. డాక్టర్లు మాత్రం అంగనిచ్ఛదం వల్లే బ్లీడింగ్ అయినట్టు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. మహిళ ఇంట్లో అంగనిచ్ఛదానికి సంబంధించిన పరికరాలు, రెండు ఆవు నాలుకలు, కత్తి, మరిన్ని మెటల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లగా విచారణ జరుగుతూ వస్తున్న ఈ కేసుకు శుక్రవారం తీర్పు వెలువడింది. అంగనిచ్ఛదానికి పాల్పడినట్టు కోర్టులో మహిళ నేరాన్ని అంగీకరించింది. మహిళ చేసిన తప్పు అనాగరిక చర్య అని, రక్షకురాలిగా ఉండాల్సిన తల్లే మోసానికి పాల్పడిందని జడ్జి 11 ఏళ్లు శిక్షను విధించారు. కూతురి అంగనిచ్ఛేదానికి సంబంధించిన అశ్లీల ఫొటోలు కూడా కలిగి ఉండటంతో మహిళకు మరో రెండేళ్ల జైలు శిక్షను పెంచి మొత్తంగా పదమూడేళ్ల శిక్షను ఖరారు చేశారు. మహిళ మాజీ భర్త కూడా ఇటీవల ఓ నేరానికి పాల్పడి జైలు శిక్షను అనుభవిస్తుండటం గమనార్హం. కాగా, బ్రిటన్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఫిమేల్ జెనిటల్ ముటిలేషన్(స్త్రీ అంగనిచ్ఛేదము) అనేది జరుగుతూనే వస్తోంది. అయితే బ్రిటన్ ప్రభుత్వం స్త్రీ అంగనిచ్ఛేదానికి పాల్పడటం నేరమంటూ 1985లో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు. ఇప్పటికీ బ్రిటన్‌లో అంగనిచ్ఛేదం యధేచ్చగా కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మంది స్త్రీలు అంగనిచ్ఛేదం కారణంగా బాధపడుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)