కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య

మాలూరు: కడుపు నొప్పి తాళలేక వివాహిత మహిళ విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నఘటన తాలూకాలోని రాం పుర గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలు రాంపుర గ్రామానికి చెందిన వి సవిత. ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా పిల్లగుండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, లలితల కుమార్తె. వీరు మాలూరు తాలూకా కుడియనూరు గ్రామ పంచాయతీలోని రాంపుర గ్రామానికి చెందిన గౌరారెడ్డి కుమారుడు నరసింహారెడ్డితో ఏడాదిన్నర కింద పెళ్లి జరిపించారు. భార్యభర్తలు ఇద్దరు అన్యోన్యంగానే ఉండేవారని తెలిసింది. వీరికి యేడాది వయసున్న కొడుకు ఉన్నాడు.

కడుపునొప్పితో సమస్య
సవితకు తరచుగా కడుపు నొప్పి వస్తుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేదని తెలిసింది. ఈ మధ్య సమస్య తీవ్రమైంది. దీంతో జీవితంపై విరక్తిచెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త నరసింహారెడ్డి,కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక సవిత గురువారం మృతి చెందింది. సవిత మృతదేహాన్ని మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)