కుప్పకూలిన ఇథియోపియన్ విమానం.. 157 మంది ప్రయాణీకులు మృతి

నైరోబి: ఇథియోపిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసెంజర్ విమానం ఆదివారం ఉదయం కూలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న 149 మంది ప్యాసెంజర్లు, 8 మంది సిబ్బంది ఈ ఘటనలో మరణించినట్టు సమాచారం వస్తోంది. ఉదయం 8.38 గంటలకు బోలే ఎయిర్‌పోర్టు నుంచి ఎథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాకు బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన ఆరు నిమిషాలకే.. అంటే 8.44 గంటలకే కంట్రోల్ టవర్‌తో సంబంధం తెగిపోయింది. బిషోఫ్టు అనే నగరం సమీపంలో ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. గాలింపు చర్యలు జరుగుతున్నాయని.. ఇప్పటివరకు మాత్రం విమానానికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియలేదని ఇథియోపియన్ యాజమాన్యం ప్రకటించింది. మరోపక్క చనిపోయిన ప్యాసెంజర్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ఆ దేశ ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు. కాగా, 2010లో ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇదే మాదిరిగా కూలిపోయింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)