ట్విస్ట్ మీద ట్విస్ట్: వైసీపీలోకి సినీ నటుడు అలీ

సినీ నటుడు, కమెడియన్ అలీ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. అలీ పొలిటికల్ ఎంట్రీ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. సడెన్ గా సీన్ మార్చేశారు. ఇప్పుడు అలీ చూపు వైసీపీ పై పడింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. అలీ వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, వారితో చర్చలు జరుపుతున్నారని సమాచారం. వైసీపీ చీఫ్ జగన్ తో అలీ భేటీ కానున్నారని లోటల్ పాండ్ వర్గాలు అంటున్నాయి.

రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయిన అలీ.. ఏ పార్టీలో చేరాలి అనేది మాత్రం తేల్చులోకోలేక పోతున్నారు. ముందు తన క్లోజ్ ఫ్రెండ్ పవన్ స్థాపించిన జనసేన పార్టీలో అలీ చేరతారని అంతా అనుకున్నారు. కానీ చేరలేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలతో అలీ చర్చలు జరిపారు. దీంతో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయం అని అనుకున్నారు. ఇంతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను అలీ కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అలీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్ఫామ్ అని అంతా అనుకున్నారు. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు మరోసారి అలీ వైసీపీలో చేరనున్నారు అనే వార్తలు తెరమీదకు వచ్చాయి.

అలీ.. గుంటూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు. టీడీపీ నుంచి ఆయనకు ఎలాంటి హామీ దక్కలేదు. దీంతో నిరాశచెందిన అలీ.. వైసీపీ వైపు మొగ్గుచూపారు. అలీ అడుగుతున్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చని, భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని వైసీపీ నేతలు అలీకి హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అలీ.. జగన్ తో ఆదివారం లేదా సోమవారం భేటీ అయ్యే అవకాశం ఉందని, వైసీపీలో చేరే ఛాన్స్ ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)