ఆర్య, సాయేషా పెళ్లి సందడి.. సంగీత్‌లో అల్లు అర్జున్ కేక.. బుగ్గపై ముద్దుపెట్టి..!

తమిళ హీరో, హీరోయిన్లు సాయేషా సైగల్, ఆర్య పెళ్లి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో వీరిద్దరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్లిలో భాగంగా శనివారం రాత్రి సంగీత్ కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య జరిగింది. ఈ వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేక పుట్టించారు. వివరాల్లోకి వెళితే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాకతో సంగీత్ కార్యక్రమంలో సందడిగా మారింది. నూతన దంపతులు ఆర్య, సాయేషాను అల్లు అర్జున్ ఆప్యాయంగా పలుకరించారు. అల్లు అర్జున్ రావడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. నూతన వధూవరుల ఆనందంలో స్టైలిష్ స్టార్ భాగమయ్యారు.ఆర్య, సాయేషాలకు అల్లు అర్జున్ వివాహా శుభాభినందనలు తెలిపి.. వారిని ప్రేమతో కౌగిలించుకొన్నారు. ఇద్దరికి బుగ్గుపై ప్రేమతో ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకొన్నారు. వివాహా శుభాకాంక్షలు అందజేశారు. అల్లు అర్జున్ కనిపించగానే పెళ్లి వేదిక వద్ద కొత్త ఎనర్జీ కనిపించింది.

ప్రముఖ సినీ దిగ్గజాలు దిలీప్ కుమార్, సైరా భాను మనువరాలు సాయేషా అనే విషయం తెలిసిందే. ఆర్య, సాయేషా పెళ్లికి హైదరాబాద్ వేదిక‌గా మారడం గమనార్హం. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరుకావడం విశేషంగా మారింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీగా మారిన ఈ పెళ్లికి సంబంధించిన వేదికను చాలా గోప్యంగా ఉంచారు. యాంగ్రీ హీరో సంజయ్ దత్ ఈ సెలబ్రేషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. అలనాటి నటి అంజు మహేంద్రు, సూరజ్, ఆదిత్య పంచోలి ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు. అలనాటి అందాల తార సైరా భాను మనవరాలి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. ఆదివారం రాత్రి ఆర్య, సాయేషా పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)