ఆస్ట్రేలియాపై దుమ్మురేపిన భారత్ ఓపెనర్లు..! ఏళ్లనాటి సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్..!

ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా ఆదివారం జరుగుతున్న నాలుగో వన్డేలో దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్- రోహిత్ శర్మ జోడీ.. వన్డేల్లో సచిన్- సెహ్వాగ్ అరుదైన ఓపెనింగ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈరోజు మ్యాచ్‌లో ఆరంభ ఓవర్ నుంచే శిఖర్ ధావన్ (60 నాటౌట్: 56 బంతుల్లో 9x4) బౌండరీల మోత మోగించగా.. తొలుత నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ (41 నాటౌట్: 52 బంతుల్లో 3x4, 1x6) తొలి పవర్‌ప్లే ముగుస్తున్న దశలో గేర్ మార్చాడు. దీంతో.. 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది.

భారత్‌కి మెరుగైన ఆరంభమిచ్చిన ఈ ఓపెనింగ్ జోడీ.. ఏళ్లనాటి సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్‌ను ఈరోజు బ్రేక్ చేసింది. వన్డేల్లో సుదీర్ఘకాలం ఓపెనర్లుగా ఆడిన సచిన్, సెహ్వాగ్.. 4,387 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. తాజాగా 4,389 పరుగులతో ఆ రికార్డ్‌ను రోహిత్- ధావన్ జోడీ బ్రేక్ చేసింది. అయితే.. భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా సచిన్- సౌరవ్ గంగూలీ జోడీ 8,227 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)