మరోసారి మానవత్వం చాటిన భారత్.. పాక్ నుండి భారత్ లోకి వచ్చాడు

శాంతి కోసం తాము పాటుపడుతున్నామని ఎప్పటి నుండో పాకిస్థాన్ చెప్పుకుంటూ ఉంది. కానీ చేసే పనులేమో శూన్యం..! భారత్ మాత్రం ఇప్పటికే ఎన్నోసార్లు తన పెద్ద మనసును చాటుకుంది కూడానూ..! పాకిస్థాన్ ప్రజలకు ఆపరేషన్లు చేయడం.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఆదుకోవడం చేస్తో వచ్చింది. తాజాగా కూడా భారత్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకుంది.

పాక్ భూభాగం నుంచి పొరపాటున సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశించిన ఓ వ్యక్తిని సురక్షితంగా పాక్ సైనికులకు బీఎస్ఎఫ్ జవాన్లు అప్పగించారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద శాంతి, సుస్థిరతను కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుందని జవాన్లు తెలిపారు. పాక్ కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని సాంబా జిల్లాలో సరిహద్దులు దాటాడు. అతన్ని గుర్తించిన భద్రతాబలగాలు, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని విచారించగా, పొరపాటున సరిహద్దు దాటానని చెప్పాడు. అతడికి ఎటువంటి హాని కూడా తలపెట్టలేదు భారత్.. హుందాగా పాక్ సైన్యానికి అతడిని అప్పగించింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)