ఒకే కారులో వచ్చి ఓటు వేసిన చిరంజీవి, నాగార్జున

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకోవడానికి సినీ ప్రముఖ వస్తుండడంతో హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమవడంతో సినీ ప్రముఖులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వచ్చి ఓటు వేయగా, కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం వీరిద్దరూ ఫిలిం చాంబర్‌కు ఒకే కారులో వచ్చారు. వీరితో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓటు వేశారు.

ఇక ప్యానెళ్ల విషయానికొస్తే.. శివాజీరాజా వైపు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరణ్ సహా 25 మంది పోటీ చేస్తున్నారు. అలాగే నరేశ్‌ ప్యానెల్‌లో జీవిత, రాజశేఖర్‌, శివ బాలాజీ సహా 26 మంది సభ్యులతో బరిలోకి దిగారు. ఈ ఎన్నికలు రెండు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరుగుతోంది. మరోవైపు, వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నటి హేమ పోటీ చేస్తున్నారు. గత కార్యవర్గంలో జాయింట్ సెక్రటరిగా హేమ సేవలు అందించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే పోటీలో ఉన్న శివాజీ రాజా ప్యానెల్ నుంచి ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, వేణు మాధవ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరణ్ ఓటు వేశారు. నరేష్ ప్యానెల్ నుంచి రాజశేఖర్, నరేష్, జీవిత, శివ బాలాజీ, మధుమిత సహా పలువురు ఓటు వేశారు. ఇక మిగిలిన వారిలో హీరో సాయిధరమ్ తేజ్, సునీల్, వెన్నెల కిశోర్, జేడీ చక్రవర్తి, ఝాన్సీ, డైరెక్టర్ రవిబాబు, హీరోయిన్ ప్రియమణి, సుమ కనకాల, శ్రీముఖి, ఊహ, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, కృష్ణ భగవాన్‌, సాయికిరణ్‌, దాసరి అరుణ్‌కుమార్‌ సహా పలువురు ఆర్టిస్టులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)