సచిన్‌ రికార్డులేవీ వదలడు

కరాచి: ప్రపంచ క్రికెట్లో సచిన్‌ తెందుల్కర్‌ నెలకొల్పిన రికార్డులన్నింటినీ విరాట్‌ కోహ్లి బద్దలు కొడతాడని పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాడు జహీర్‌ అబ్బాస్‌ అన్నాడు. ఇటీవలే వన్డేల్లో 39వ సెంచరీని అందుకున్న విరాట్‌.. సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక వన్డే శతకాల (49) రికార్డుకు మరింత చేరువయ్యాడు. ఈ నేపథ్యంలో అబ్బాస్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికైతే విరాటే ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అతను అన్ని రికార్డులనూ బద్దలు కొడతాడు. సచిన్‌ సాధించిన రికార్డులేవీ అతను వదిలి పెట్టడు’’ అని అబ్బాస్‌ అన్నాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)