చిత్తూరులో ఫేస్‌బుక్‌ ఫైటింగ్‌

ఫేస్‌బుక్‌లో వివాదాస్పద కామెంట్లు చేసిన యువకుడిని ఓ గ్రూపు చితకబాదింది. చిత్తూరుకు చెందిన శరత్‌రెడ్డి అతని ఫ్రెండ్స్‌ కలిసి ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీశారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌పై సాధిక్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో వివాదాస్పద కామెంట్లు చేశాడు. దీనిపై మండిపడ్డ శరత్‌ రెడ్డి టీమ్‌ సాధిక్‌ను చితకబాదారు. అంతేకాకుండా గీతాంజలిరెడ్డి అనే మహిళ యువకుడిని కొట్టిన విజువల్స్‌ కూడా వైరల్‌ కావడంతో చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన 9 మందిలో ముగ్గురు మైనర్లు కావడంతో వారిని జువైనల్‌ హోం కు తరలించి మిగతా ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)