రజని కుమార్తె సౌందర్య రెండో వివాహం.. అక్క, బావ దగ్గరుండి మరీ.. పెళ్లి కొడుకు కూడా!

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అయిన విశాగన్ వనంగమూడిని సౌందర్య రెండో వివాహం చేసుకోబోతోంది. ఫిబ్రవరి 11న జరగబోయే వీరి వివాహానికి సంబందించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా గ్రాండ్ గా సౌందర్య రజనీకాంత్ వివాహ వేడుక జరగబోతోందట. ఇప్పటికే కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

సౌందర్య రజినీకాంత్ వివాహానికి సంబందించిన పనులు రజని నివాసంలో ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు పెళ్లి వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న చెన్నైలోని ఎంఆర్ సి నగర్ లోని స్టార్ హోటల్ లో సౌందర్య, విశాగన్ వివాహం జరగబోతోంది. పెళ్లి వేడుకకంటే ముందుగా పోయస్ గార్డెన్ లోని రజని నివాసంలో పూజా కార్యక్రమం జరగబోతున్నట్లు తెలుస్తోంది.

సౌందర్య పెళ్లి వేడుక సందర్భంగా రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్,పెద్ద కుమార్తె ఐశ్వర్య సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ గా రెండు పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరదలి పెళ్లి ఉండడంతో ధనుష్ పెళ్లి కార్యక్రమాల్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. అతిధులందరికి పెళ్లి పత్రికలు ఇచ్చి ఆహ్వానించే బాధ్యతని సౌందర్య, ధనుష్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సౌందర్య ఓ షాపింగ్ మాల్ లో పెళ్ళికి అవసరమైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తూ కనిపించింది.

సౌందర్యకు కాబోయే భర్త విశాగన్ ప్రముఖ ఫార్మా కంపెనీకి అధినేత. అంతేకాకుండా పలు చిత్రాల్లో నటుడిగా కూడా విశాగన్ రాణిస్తున్నాడు. విశాగన్ కు కూడా ఇది రెండవ వివాహమే. విశాగన్ గతంలో కణిక కుమారన్ అనే మ్యాగజైన్ ఎడిటర్ ని వివాహం చేసుకున్నాడు. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ విడాకులతో విడిపోయారు.

సౌందర్య రజనీకాంత్ గతంలో వ్యాపారవేత్త అశ్విన్ ని వివాహం చేసుకుంది. విభేదాలు కారణంగా 2017లో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం రెండో వివాహానికి సిద్ధం అవుతోంది. సౌందర్య రజనీకాంత్ పలు చిత్రాలకు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. దర్శకురాలిగా కూడా రజనీకాంత్ తో కొచ్చాడియాన్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తీవ్రంగా నిరాశపరిచింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)