భార్య సహకారంతోనే భార్య స్నేహితురాలిపై అత్యాచారం చేసిన భర్త

 
ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ లో మరో దారుణ ఘటన చోటుచేసుంది. ఓ యువతిపై స్నేహితురాలి భర్తే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే స్నేహితురాలి సహకారంతోనే ఆమె భర్త తనపై అఘాయిత్యానికి పాల్నడినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముజఫర్ నగర్ పట్టణానికి చెందిన ఓ 23ఏళ్ల యువతి ఒంటరిగా నివసిస్తోంది. ఈమెకు ఓ వివాహితతో పరిచమైంది. అయితే ఆ స్నేహితురాలిపై వివాహిత భర్త కన్నేశాడు. ఆమెను లోబర్చుకోడానికి భార్య సహకారాన్ని తీసుకున్నాడు. ఇందుకోసం భార్యభర్తలిద్దరు కలిసి ఓ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా వివాహిత తన భర్తను దూరపు బందువుగా చెప్పి బాధితురాలికి పరిచయం చేసింది. దీంతో తరచూ అతడు యువతి ఇంటికి వచ్చిపోవడం చేసేవాడు. ఇలా కాస్త పరిచయం పెరిగాక యువతిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన స్నేహితురాలి సహకారంతోనే ఆమె భర్త తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి భార్యభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)