డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ్డ సింగ‌ర్ రాహుల్‌

మందుబాబుల అగ‌డాల‌ను అరిక‌ట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ఏ మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌తి రోజు మందుతాగి ట్రాఫిక్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడ్డాడు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్‌ వైపు వస్తున్న రాహుల్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయింట్లు వచ్చాయి. అయితే, తాగిన మైకంలో ఉన్న రాహుల్ పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని కారును సీజ్ చేశారు. రాహుల్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది రాహులే. పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)