కన్నకూతురిపై తండ్రి అత్యాచారం, చిన్నప్పటి నుండి

ఓ ఇరవైమూడేళ్ల వివాహితపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో బైటపడింది. అయితే ఈ అఘాయిత్యం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదని, చిన్నప్పటి నుండి తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు ఆవేధన వ్యక్తం చేసింది. అయితే ఈమె ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గోల్కొండ ప్రాంతంలో నివాసముండే ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో తనకు తండ్రి నుండి ప్రమాదం పొంచివుందని ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా కన్నతండ్రి వావివరసలు మరిచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా ఇప్పుడే కాదు చిన్నప్పటినుండి లైంగిక దాడికి పాల్పడేవాడని బాధితురాలు వాపోయింది. అయితే తనకు పెళ్లయినప్పటికి ఇంకా వదలడం లేదని, ఇప్పుడు కూడా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశస్తున్నాడని పేర్కొంది. ఈ విషయాన్ని బైటపెట్టవద్దని తనను బెదిరిస్తున్నాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆమెను భరోసా సెంటర్ కు పంపించి ఆమె స్కటేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)