తాను పెళ్లి చేసుకోబోయే యువతి ప్రొఫైల్‌ను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టాడు.. ఫోన్ చేసి డేటింగ్‌కు వస్తావా అంటూ

తాను పెళ్లి చేసుకోబోయే యువతి ప్రొఫైల్‌ను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టాడు. దీన్ని చూసిన పలువురు యువకులు ఆమె నంబరుకు ఫోన్ చేసి డేటింగ్‌కు వస్తావా అంటూ వేధించసాగారు. దీంతో ఖంగుతిన్న బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఇంజనీర్ అయిన కాబోయే వరుడుని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ నగరంలోని వసంత్‌కుంజ్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. ఆమె పెళ్లి చేసుకునేందుకు తన ప్రొఫైల్‌ను వివాహ వెబ్‌సైట్‌లో పెట్టగా మిలటరీ ఇంజినీర్ సర్వీస్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడితో వివాహం కుదిరింది. రెండు కుటుంబాల పెద్దలు వీరికి వివాహ నిశ్చితార్థం కార్యక్రమం చేసుకోవాలనుకున్నారు. అంతలో కాబోయే వరుడే వధువు అయిన ఎయిర్ హోస్టెస్ ఫోటోతో ప్రొఫైల్‌ను పోర్న్‌వెబ్ సైట్‌లో పెట్టాడు. ఈ ప్రొఫైల్‌ను చూసిన పలువురు అపరిచితులు డేటింగ్‌కు వస్తావా అంటూ ఎయిర్ హోస్టెస్‌కు ఫోన్లు చేశారు. తన ప్రొఫైల్‌ను పోర్న్ సైట్‌లో పెట్టారని తెలుసుకున్న ఎయిర్ హోస్టెస్ షాక్ తింది. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఎయిర్ హోస్టెస్‌తో నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడే ఆమె ప్రొఫైల్‌ను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టాడని తేలింది. పెళ్లి చేసుకోకుండా ఎయిర్ హోస్టెస్‌తో డేటింగ్ చేసేందుకు యువకుడు ఇలా చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో మిలటరీ ఇంజినీరు అయిన యువకుడిని అరెస్టు చేశారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)