చర్చిలలో ఏం జరుగుతోంది? పాస్టర్ల అఘాయిత్యాలపై సుప్రీంకోర్టు సీరియస్

చర్చి పాస్టర్లపై రేప్ కేసులు న‌మోదవుతుండ‌టంపై సుప్రీంకోర్టు విస్మ‌యం వ్య‌క్తం చేసింది. కేర‌ళ‌లో ఏం జ‌రుగుతోంద‌ని? ఆ రాష్ట్ర యంత్రాంగాన్ని ప్ర‌శ్నించింది. వివాహిత‌పై న‌లుగురు పాస్ట‌ర్లు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌టంపై స‌మ‌గ్ర నివేదిక అంద‌జేయాల‌ని కేర‌ళ పోలీసుల‌ను ఆదేశించింది. కేర‌ళ చ‌ర్చి ఫాద‌ర్ పై ఆరోప‌ణ‌లున్న ఇలాంటి మ‌రో కేసులో విచార‌ణ‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. మ‌లంకార సిరియ‌న్ ఆర్థోడాక్ చ‌ర్చికి సంబంధ‌మున్న న‌లుగురు ఫాద‌ర్లు అదే చ‌ర్చికి వ‌చ్చే వివాహిత‌ను లోబ‌ర్చుకుని శారీర‌కంగా వాడుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ కేసు కేర‌ళ హైకోర్టు దాకా వెళ్లింది. నిందితుల‌కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయ‌స్థానం నిరాక‌రించ‌టంతో వారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. విచారించిన న్యాయ‌స్థానం త‌దుప‌రి విచార‌ణ జ‌రిగే వచ్చే నెల 16 వ‌ర‌కు ఇద్ద‌రు మ‌తాధికారుల‌కు బెయిల్ ఇచ్చింది. మ‌రో ఇద్ద‌రు ఇప్ప‌టికే లొంగిపోయారు. ఇక కేర‌ళ‌లోని కొట్టియూర్‌ కు చెందిన‌ ఓ చ‌ర్చి ఫాద‌ర్ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డంతో ఆమె గ‌ర్భ‌వ‌తి అయింది. త‌న‌కు తెలిసిన ఆసుప‌త్రిలో ఆమెకు పురుడు పోయించాడు. విష‌యం వెలుగులోకి రావడంతో కేసు హైకోర్టుకు చేరింది. అక్క‌డి హైకోర్టు స్టేకు నిరాక‌రించ‌డంతో నిందితుడు సుప్రీం గ‌డ‌ప‌తొక్కాడు. విచారించిన కోర్టు ఆగ‌స్టు 1వ తేదీ నుంచి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది. సంబంధిత డాక్ట‌ర్‌, సిబ్బంది కూడా నిందితులేన‌ని తెలిపింది.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)