పురుషులకు స్త్రీలతో మర్దన, అవసరమైతే అది కూడా

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మెల్లమెల్లగా ముందుకు పోతోంది. అభివృద్ధి ఎక్కడ వుంటుందో అక్కడ హైటెక్ పనులు కూడా వుంటాయి. అంటే... సాంకేతికంగా కొన్ని వుంటే, మరికొన్ని పక్కదోవ పట్టించేవిగా వుంటాయి. ఇలాంటివే ఇప్పుడు విజయవాడ నగరంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడలోని గురునానక్ కాలనీ, మొఘల్రాజపురం ప్రాంతాల్లో మర్దనా కేంద్రాలు చాలా వున్నాయి. ఐతే వీటిలో నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ కేంద్రాల్లో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. పురుషులకు స్త్రీలతో, స్త్రీలకు పురుషులతో మర్దన నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. ముఖ్యంగా పురుషులకు స్త్రీలు మర్దన చేసేటపుడు కొన్నిసార్లు లైంగిక కోర్కెలను తీర్చాలంటూ సదరు మహిళలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అందటంతో సదరు కేంద్రాలపై పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ మసాజ్ కేంద్రం ప్రవర్తించినా వాటిని సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)