నేను షార్ట్స్ వేసుకుంటే కింద నుంచి కెమెరాలు పెట్టి మరీ నా తొడలు చూపించారు.. మరి గీత మాధురి తొడలు ఎందుకు చూపించలేదు

Loading...
పాపం, తేజస్వి… బిగ్ బాస్ షో నుంచి బయటికొచ్చాక హాట్‌స్టార్‌లో వీడియోలన్నీ తిరగేశాక బిగ్‌బాస్ అసలు తత్వం బోధపడినట్టుంది… జనం తనను ఎందుకు ద్వేషించి, బయటికి పంపించారో అర్థమైనట్టుంది… అందరు కంటెస్టెంట్ల పట్ల ఒకేతీరుతో వ్యవహరించాల్సిన బిగ్‌బాస్ నిర్వాహకులు కావాలనే కొందరిపట్ల అనుకూల లైన్ తీసుకుని, కొందరిపట్ల అనుచిత ధోరణితో ఉంటున్నారనే విమర్శలు చాలారోజులుగా ఉన్నవే… ఇప్పుడు తేజస్వి మాటలు దాన్నే బలపరుస్తున్నాయి… ప్రత్యేకించి ఎక్కువ టారిఫ్ తీసుకునే గీతామాధురి పట్ల బిగ్‌బాస్ సాఫ్ట్ కార్నర్ ఉండగా, మిగతా లేడీ కంటెస్టెంట్ల పట్ల డిఫరెంటుగా ఉన్నదనేది తేజస్వి ఆరోపణ… షో నుంచి బయటికి వచ్చాక ఆమె అక్కడిక్కడా మాట్లాడుతూ హౌజులో ఏం జరుగుతున్నదో చెప్పేస్తున్నది… తను కాస్త ఓపెన్ కదా… అలాగే చెబుతున్నది…

‘‘బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాకే నా గురించి బ్యాడ్‌గా ఉందని తెలుసుకున్నా… నేనో గయ్యాళిని, నేను అది, నేను ఇది అనేలా నా కేరక్టర్ చూపించారు… బాధేసింది… దాని ఆధారంగా సాగిన ట్రోల్స్ చూసి మరీ బాధేసింది… బిగ్‌బాస్‌లో చూపించిన సీన్ల తీరు చూసి ఎవరైనా అలాగే అనుకుంటారు… ట్రోల్ చేసేవాళ్లను తప్పుపట్టేట్టు లేదు… సామ్రాట్‌తో నా రిలేషన్ చాలా చీపుగా చూపించారు… నేను షార్ట్స్ వేసుకుంటే కెమెరాలు కింద పెట్టి మరీ నా తొడలు చూపించారు… అదే పని గీతామాధురి చేస్తే ఆమె తొడలు చూపించలేదు…’’ అని చెప్పింది తేజస్వి… షార్ట్స్ వేసుకుంటే కింద నుంచి కెమెరాలు పెట్టి మరీ తొడలు చూపించడం అనేది తీవ్రమైన ఆరోపణే… బిగ్‌బాస్ షో కొంత రెగ్యులర్‌గా టీవీలో వస్తుంది, మరికొంత అన్‌సీన్ పేరిట హాట్‌స్టార్‌లో వస్తుంది… బయటికొచ్చాకే అవన్నీ చూసి షాక్ అయినట్టుంది…

‘‘ఒక హౌజులో ఒక వ్యక్తితో కనెక్టయి కలిసిమెలిసి తిరిగితే సంబంధాన్ని అంటగట్టేయడమేనా..? రొమాంటిక్ సీన్లేనా..? మరో నెల ఆగితే మా ఇద్దరికీ పెళ్లి కూడా చేసేవాళ్లేమో..? (సామ్రాట్‌తో…) 24 గంటల్లో మీరు చూసేది కాసింతే… అదీ బిగ్‌బాస్ ఏది చూపిస్తే అది… అందుకే నామీద ఈ దురభిప్రాయం…’’ అంటున్నది… అంటే ఎడిట్ చేసి ప్రేక్షకులకు చూపించే తీరులోనే తప్పు ధోరణి కనిపిస్తున్నదనేది ఆమె ఆరోపణ… నిజానికి బయట ఉన్న అభిప్రాయం అదే… సామ్రాట్‌తో నిన్న ఫోన్‌లో మాట్లాడినప్పుడు వాళ్ల అమ్మ కూడా అదే చెప్పింది… ‘నువ్వు హౌజుకు ఎందుకు పోయావో దానిమీదే ధ్యాస పెట్టక ఇతరత్రా వ్యవహారాలు దేనికి..? జనంలో బ్యాడ్ అవుతున్నది’’ అన్నట్టుగా మెత్తగా మందలించింది… అంతెందుకు తనీష్, దీప్తి సునయన మీద కూడా ఇలాంటి సీన్లే చూపిస్తున్నారని తేజస్వి ఆరోపణ… తనీష్‌తో మాట్లాడిన కుటుంబసభ్యులు కూడా దీప్తితో తన క్లోజ్ మూమెంట్స్ జనంలో నెగెటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నట్టు చెప్పారు… సరే, బిగ్‌బాస్ ఇంత వెకిలి ధోరణితో ఉన్నప్పుడు, మళ్లీ హౌజులోకి వెళ్లడానికి వోట్లేయండీ అని క్యాంపెయిన్ ఎందుకు చేసుకుంటున్నట్టు తేజస్వి..?
Loading...

Popular Posts