నాకు ఎయిడ్స్ ఉంది.. నన్ను కౌగిలించుకోండి

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అజిమా అనే అమ్మాయి నాకు ఎయిడ్స్ ఉంది.. నన్ను కౌగిలించుకోండి.. అంటూ ఓ ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడింది. దీంతో ఆ అమ్మాయికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది వచ్చి ఆ అమ్మాయిని కౌగిలించుకొని దైర్యం చెప్పి వెళ్లారు. దీంతో అజిమా కూడా ఎంతో సంతోషించింది. దీనికి సంబంధించిన వీడియోను యూనిసెఫ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. "గత 10 సంవత్సరాల నుంచి నేను హెచ్‌ఐవీ పాజిటివ్(ఎయిడ్స్)తో బాధపడుతున్నాను. అంతా ఓకే. నాకేం కాలేదు. నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎయిడ్స్ ఉన్నా ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా అందరిలాగే తమ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చని చెప్పడం కోసమే నాఈ ప్రయత్నం. ఇంత రెస్పాన్స్ వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. ఒక్కొక్కరు నన్ను కౌగిలించుకుంటుంటే.. నా ఫ్యామిలీ మెంబర్సే కౌగిలించుకున్నట్లుగా అనిపించింది.." అంటూ ఉద్వేగానికి లోనయింది అజిమా. నిజానికి హెచ్‌ఐవీ అనేది మూడు రకాలుగా మాత్రమే సోకుతుంది. రక్తం ద్వారా, అసురక్షితమైన శృంగారం, తల్లి నుంచి బిడ్డకు మాత్రమే సోకుతుంది. కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా, కలిసి అన్నం తినడం ద్వారా మాత్రం సోకదు.. అంటూ ఆ వీడియోలో కింద క్యాప్సన్స్ ద్వారా ప్రజలకు అవేర్‌నెస్ కలిగించింది యూనిసెఫ్. ఇక.. ఈ వీడియోకు నెటిజన్లు కూడా తమదైన శైలిలో రియాక్టయ్యారు. తనపై జాలి చూపించారు. కామెంట్ల రూపంలో తనకు భరోసా ఇచ్చారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)