ఇంట్లో తుపాకులు పేల్చి బయట తిరుగుతున్న వారి సంగతేంటి?: బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా పవన్ సంచలన విమర్శ

జ‌న‌సేన సైనికులు బైక్ సైలెన్స‌ర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసిన‌ట్లు చూస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇంట్లో తుపాకీతో కాల్చి బ‌య‌ట‌ తిరుగుతున్న వాళ్ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. జ‌న‌ సైనికుల సంస్కారం చాలా గొప్ప‌ద‌ని వ్యాఖ్యానించిన ఆయన, అధికారులు లంచాల మ‌త్తులో మునిగి ఉన్నారని, అక్ర‌మంగా ఆక్వాకు వంత‌ పాడ‌ుతున్నారని, అందువల్లే తాగు నీరు క‌లుషిత‌మ‌వుతుంద‌ని ఆరోపించారు.  కాగా, పవన్ కల్యాణ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఈ విమర్శలు చేసినప్పటికీ, ఇవి హిందూపురం ఎంపీ బాలకృష్ణ గురించి చేసినవేనని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పెడుతున్నారు. 2004లో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలగా, నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎవరు కాల్చారో తనకు తెలియదని బెల్లంకొండ చెప్పడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా న్యాయస్థానం ఈ కేసును కొట్టేసింది.

Latest Posts