హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని దృశ్యం ఇది.. అతడి ఫొటో తీసి.. ‘ఇప్పుడు ఎంత బాగున్నావో చూడు’ అంటూ

నూనె అంటే ఎంటో తెలియని జుట్టు.. దుస్తులు ఎప్పుడు వేసుకున్నాడో తెలియని పరిస్థితి. రోడ్ల వెంట తిరగడం, అడుక్కోవడం, పెడితే తినడం.. ఫుట్‌పాత్‌పై పడుకోవడం.. ఇదీ అతడి జీవితం. యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ సభ్యులు ఇలాంటి వారికి మేమున్నామంటూ చేయూతనిస్తున్నారు. భాగ్యనగరంలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ అనాథను యంగిస్థాన్ ఫౌండేషన్ సభ్యులు అక్కున చేర్చుకున్నారు. హెయిర్ కట్ చేయించి, కొత్త దుస్తులు తొడిగించారు. తర్వాత సెల్‌ఫోన్‌లో అతడి ఫొటో తీసి.. ‘ఇప్పుడు ఎంత బాగున్నావో చూడు’ అంటూ చూపించారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)