పెళ్లైన వారానికే: అసహజ శృంగారం కోసం భార్యపై ఒత్తిడి, నగ్న వీడియోలు, ఫోటోలతో ఇలా

Loading...
పెళ్లి సమయంలో రూ.7 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలను అందించారు. పెళ్లైన వారం రోజులకే శ్రీనివాస్ ప్రవర్తనతో బాధితురాలు తీవ్రంగా ఇబ్బందులు పడినట్టు చెబుతోంది. పడకగదిలోకి వెళ్లగానే శ్రీనివాస్ అసహజ శృంగారంతో తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి తాను మత్తులోకి వెళ్లిన తర్వాత తనను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసేవాడని బాధితురాలు ఆరోపించింది. అసహజ శృంగారం కోసం తనను వేధింపులకు గురిచేసేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా కాలం వరకు ఈ విషయమై ఎవరికీ కూడ చెప్పలేదు.ఈ విషయాలను బయటకు చెబితే తన నగ్న వీడియోలను బయటపెడతానని బెదిరించేవాడని బాధితురాలు చెప్పింది. చివరకు అత్తింట్లో చెబితే తన భర్తకే మద్దతుగా నిలిచారని బాధితురాలు ఆరోపించారు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి వెళ్లినట్టు ఆమె చెప్పారు. అంతేకాదు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారని ఆమె చెప్పారు. కౌన్సిలింగ్ నిర్వహించినా పద్దతిని మార్చకోకపోతే అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. జైలు నుండి విడుదలైన తర్వాత నిందితుడు తమ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ మద్యం తాగి తమ ఇంటికి వచ్చి వేధింపులకు గురిచేసేవాడని మద్యం సీసాలను ఇంటిపై విసిరివేసేవాడని బాధితురాలు ఆరోపించారు. స్థానికులు ఈ విషయమై నిందితుడికి దేహశుద్ది చేసినా కానీ ఫలితం లేకుండాపోయిందన్నారు. మరోవైపు విడాకులను కోరుతూ తాను దాఖలు చేసినా పిటిషన్ ‌పై విడాకులు ఇస్తానని చెప్పాడని ఆ తర్వాత తనకు విడాకులు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
Loading...

Popular Posts