సొంత చెల్లిని రేప్ చేస్తూ తల్లికి రెడ్ హ్యాండెడ్ గా దొిరికిపోయాడు.. అయినా.. ఆ తల్లి ఏంచేసిందో తెలుసా

ఛండీఘర్‌లోని ఖరార్ ప్రాంతానికి చెందిన 11ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి ఉంటోంది. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన 22ఏళ్ల అన్న బాలికపై కన్నేశాడు. ఏడాదిన్నర క్రితం ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా.. ఇదంతా అబద్ధమని భావించింది. తన కూతురు ఏదో భ్రాంతిలో ఇలా మాట్లాడుతుంది అనుకొని ఓ తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లి తాయత్తు కట్టించింది. ఆ తర్వాత ఆ నీచుడి పైత్యం మరింత పరాకాష్టకు చేరింది. ఆమెపై పదే, పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఓరోజు బాలికపై అఘాయిత్యం చేస్తూ తల్లికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడా దుర్మార్గుడు. జరిగిన ఘోరాన్ని తప్పుబట్టాల్సిందిపోయి.. అతడ్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. పరువుపోతుందని భావించి ఈ విషయాన్ని బయటపెట్టొద్దని కూతుర్ని కూడా హెచ్చరించింది. అప్పటి నుంచి బాలిక తనలో తాను కుమిలిపోయింది. ఈలోపే ఆమె చదువుతున్న స్కూల్లో అసహజ స్పర్శలు, లైంగిక పరమైన వేధింపులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ జరిగిన స్పెషల్ కౌన్సెలింగ్, క్లాసులతో ఆమె తనపై ఎలాంటి ఘోరం జరిగిందో గ్రహించింది. బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తోటి స్నేహితురాళ్లకు చెప్పింది. వారి సాయంతో స్కూల్ సిబ్బందికి చెప్పగా.. వారు చైల్డ్ లైన్ సభ్యుల్ని సంప్రదించారు. వారు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం బాలిక, తల్లి వాంగ్మూలాలను రికార్డు చేశారు. నిందితుడు ఓ సైకిల్ రిపేర్ షాపులో పని చేస్తున్నాడు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)