కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారం సంఘటనలు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పీకల్లోతుకు తాగిన ఓ ప్రబుద్ధుడు సొంత కూతురిపైనే అత్యాచారం చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లి తన కూతురిని ఇంట్లో వదిలి తన సోదరుడి ఇంటికి గత గురువారం వెళ్లింది. ఆమె ఇంట్లోలేదని గమనించిన ఆమె భర్త నిద్రపోతున్న తన 13ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు.
బాధితురాలి తల్లి ఇంటికి రాగానే జరిగిందంతా బాలిక తల్లికి వివరించింది. ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొన్ని నెలలుగా ఎలాంటి పనిచేయకుండా ఖాళీగా ఉంటున్న నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. మోరదాబాద్ జిల్లాలో నాలుగేళ్ల బాలికను రేప్ చేసిన ఘటనలో శుక్రవారం 15ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)