ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విషయం మాత్రం బయటకు వచ్చేసింది.. రాణాకు కిడ్నీ మార్పిడి చేయాలి

గత కొంతకాలంగా హీరో రానా దగ్గుబాటి అనారోగ్యసమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుందామని అనుకున్నా.. విషయం మాత్రం బయటకు వచ్చేసింది. దీంతో తన కొడుకు ఆరోగ్యంగానే ఉన్నడంటూ సురేష్ బాబు కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నిజంగానే రానా ఆరోగ్యం పాడవుతుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. రానాకు ఒక కన్ను కనిపించదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ కన్ను కారణంగానే శరీరంలో ఉన్న మిగిలిన అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని సమాచారం. వెంటనే ఆయనకు కిడ్నీ మార్పిడి చేస్తే మంచిదని వైద్యులు సూచించడంతో డోనర్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే దగ్గుబాటి కుటుంబ సభ్యుడే ఒకరు రానాకు కిడ్నీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లోనే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం రానా సర్జరీ కోసం అమెరికాకు పయనమవనున్నారు. ప్రస్తుతం రానా చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే ఆ సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)