40 మంది చేతుల్లో నాలుగు రోజుల పాటు నరకం.. ఒకరి తర్వాత ఒకరు పైశాచికం

చెన్నైలో మైనర్ బాలికపై 24 మంది కామాంధులు జరిపిన దారుణ అత్యాచార ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఆ ఘటన తర్వాత అలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. తాజాగా హర్యానాలో ఓ 22 ఏళ్ల వివాహితపై 40 మంది నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం కలిగించింది. పంచ్‌కుల జిల్లాలోని మోర్ని ప్రాంతానికి చెందిన ఓ వివాహితకు తెలిసిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు.. అతని మాటలు నమ్మిన సదరు మహిళ ఈ నెల 15వ తేది అక్కడికి వెళ్లింది. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. ఆ రోజు నుంచి 18 వరకు 40 మంది ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె ఎలాగో ఫోన్ సంపాదించి జరిగిన ఘోరాన్ని భర్తకు చెప్పింది. వెంటనే నేను పోలీసులకు చెబుతానని అనడంతో తన భార్యను విడిచిపెట్టారని.. పోలీసులకు కనుక చెబితే ఇద్దరిని చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలి భర్త పోలీసులకు తెలిపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపి.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.. ఘటన గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించడంలో విఫలమైన ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.. ఇప్పటివరకు గెస్ట్‌హౌస్ యజమాని సహా ముగ్గురు కామాంధులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)