సీరియల్స్ లో నటిచాలంటే ఇలాంటి అగ్రిమెంట్ ఉంటుందా ? ఒక్కసారి సంతకం చేస్తే ఇక కడుపు తెచ్చుకోకూడదు

బుల్లితెరపై పాపులర్ నటిగా రాణించిన ప్రియాంక కుటుంబ సమస్యల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు ఫ్యామిలీపరంగా సమస్యలు లేవని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో తారలపై ఆంక్షలు ఉన్నట్టు దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగు చూసింది. ఏదైనా సీరియల్‌లో నటించే ముందు నిర్మాతలు విధించే కొన్ని నిబంధనలకు లోబడి వారు ఉండాల్సి ఉంటుందట. సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించే హీరోయిన్లు గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులపై మాతృత్వ నిషేధ ఒప్పందాలు ఉంటాయట. ఒకసారి అగ్రిమెంట్ సంతకం చేస్తే పిల్లలు కనకుండా ప్రొడక్షన్ సంస్థలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిందేనట.
ఎవరైనా తారలు చేసుకొన్న అగ్రిమెంట్‌కు విరుద్ధంగా గర్భం దాల్చితే రెమ్యునరేషన్లలో కోత పెట్టడం లేదా పూర్తిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు చాలానే ఉంటాయంటున్నారు. ఇదే కాకుండా ఎప్పటికప్పుడు తమ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలట. అంతే కాకుండా స్థూలకాయం బారిన పడకుండా ఉండాలని నిర్మాణ సంస్థలు హెచ్చరిస్తాయట. ఇలాంటి నిబంధనల నడుమ ప్రియాంక నలిగిపోయిందట. పెళ్లై మూడేండ్లు గడిచిన పిల్లలకు కాకపోవడంతో భర్త అరుణబాలతో విభేదాలు తలెత్తాయట. దాంతో వారిద్దరూ విడి విడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారనేది సన్నిహితుల సమాచారం. ఆ మానసిక వేదనతోనే ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)