భర్త స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తానని.. గెస్ట్‌హౌజ్‌లో 4 రోజుల్లో 40 మంది రేప్

ఇటీవలే చెన్నైలో 11 ఏండ్ల బాలికపై 18 మంది అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. హర్యానాలో 22 ఏండ్ల మహిళపై 40 మంది వ్యక్తులు నాలుగు రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టారు. మణిమజ్ర పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో రంజిత్ సింగ్ మాట్లాడుతూ..సదరు మహిళ భర్త స్నేహితుడు..ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోర్ని హిల్స్‌లోని గెస్ట్ హజ్‌కు తీసుకెళ్లాడు. జులై 15న ఆ మహిళను అత్యాచారం చేశాడు. ఆ మహిళను బెదిరించి జులై 15 నుంచి 18 వరకు (4 రోజులు)గెస్ట్‌హౌజ్‌లోనే నిర్బంధించి 40 మంది ఆమెపై అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకడైన ఆమె భర్త స్నేహితుడు గెస్ట్ హౌజ్ వద్ద ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోర్నిహిల్స్‌కు తీసుకొచ్చాడని బాధిత మహిళ చెప్పిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు గెస్ట్‌హౌజ్ సిబ్బందిని అరెస్ట్ చేశామని మణిమజ్ర పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో రంజిత్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)