డిగ్రీ ఫస్టియర్ అమ్మాయి పై కన్నేసిన కామాంధుడు.. చనువుగా మాట్లాడి ముగ్గులోకి దింపి కోరిక తీర్చుకున్నాక.

Loading...
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మాకన్నపురానికి చెందిన పదిహేడేళ్ల మైనర్ బాలిక.. డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అమ్మమ్మ ఊరికి చెందిన జయరాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ రోజు బాధితురాలు చదువుతున్న శ్రీకుమార్ డిగ్రీ కళాశాలకు వెళ్లాడతను. తెలిసిన వ్యక్తే కావటంతో చనువుగా మాట్లాడిన ఆ అమ్మాయిని.. ముగ్గులోకి దింపాడు. కల్లొబొల్లి మాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకొని వెళ్లాడు. కామాంధుడి మాటలు నమ్మి ఆ అమ్మాయి మోసపోయింది. కాలేజీకి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులకు... ఆ అమ్మాయి జయరాజ్ ఆటోలో వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత విచారణ జయరాజ్ కుటుంబ సభ్యుల వైపు మళ్లించారు. ఎంక్వైరీ చేసే కొద్ది ట్విస్ట్ లు మొదలయ్యాయి. అతనికి ఆల్రడీ పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా.. వికృత చేష్టలకు పాల్పడిన జయరాజ్ ఆచూకీ కోసం ఒత్తిడి పెంచారు. ఈ విషయం ఆ కామాంధుడికి తెలియటంతో అవసరం తీర్చుకున్నాక ఆ మైనర్ బాలికను.. మూడు రోజుల క్రితం యలమంచలి రైల్వే స్టేషన్ లో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల సాయంతో రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి చేరిన బాధితురాలు.. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
Loading...

Popular Posts