(వీడియో) యువతి వెనుక తడిమాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..

మహిళలకు గౌరవం ఇచ్చినంత సేపే. వాళ్లు రెచ్చిపోయారంటే ఎలా ఉంటదో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మహిళా శక్తి అంటే ఏంటో నిరూపించింది ఈ యువతి. ఈ ఘటన యూఎస్‌లోని సావన్నాలో చోటు చేసుకున్నది. విన్నీ వాన్ గోగో అనే రెస్టారెంట్‌లో ఓ వెయిట్రెస్ కస్టమర్లకు సర్వ్ చేస్తున్నది. ఇంతలోనే ఓ కస్టమర్ వచ్చి ఆ యువతి వెనుక టచ్ చేసుకుంటూ వెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన ఆ యువతి మనోడిని వెనక్కి లాగి కింద పడేసి తిట్టింది. దీంతో మనోడు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇక.. ఈ ఘటన రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తన భార్య, పిల్లలు అక్కడ ఉండగానే ఆ వ్యక్తి అలా చేశాడట. ఆ వీడియో ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యువతి దైర్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)