పోలీసుల వికృత చేష్టలు.. బకెట్ లో కరెంట్ పెట్టి..మూత్రం పోయించారు

అధికారానికి కొమ్ముకాసే పోలీసుల వికృత చేష్టలు ఎలా ఉంటాయనేదానికి నిదర్శనం నేరెళ్ల బాధితుల దీన గాధ. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే క్రమంలో స్థానిక ఎస్సీ, ఎస్టీలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. వీరిపై కొన్ని లారీలు కూడా దూసుకు రావడంతో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దళిత, గిరిజన, బీసీలను ఇసుక లారీల కింద తొక్కించి, తమ కుటుంబాలను చిత్రి హింసలు పెట్టి ఏడాదవుతున్నా న్యాయం చేయలేదంటూ బాధితులు వాపోతున్నారు. ఈ సందర్భంగా కరీంగనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్ రెడ్డిలతో కలిసి బాధితులు గాంధీభవన్ లో టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. న్యాయం చేయాలంటూ.. వారికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమను ఎంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారో.. చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

బాణయ్య అనే వ్యక్తినైతే.. పోలీస్ స్టేషన్ కు లాక్కొచ్చి చిత్రహింసలు పెట్టారు. రాత్రంతా నిద్రపోకుండా కొట్టారు. బకెట్లో నీటిని నింపి..అందులో కరెంట్ పెట్టి.. అతడిని చేత మూత్రం పోయించారు. ఇసుక అక్రమ రవాణను అడ్డుకున్నందుకే తనను ఇలా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయం ఎవరికైన చెబితే తమ ఆడోళ్లను వ్యభిచారం కేసుల్లో, మగాళ్లను గంజాయి కేసుల్లో ఇరికిస్తామని ఎస్పీ విశ్వజిత్ బెదిరించారని వాపోయాడు.

మరో వ్యక్తి గంధం గోపాల్ ను అయితే… రాత్రి 11గంటలకు తీసుకెళ్లిన పోలీసులు ఉదయం నమాజ్ టైం వరకు కొడుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా… అతని చెవులకు, కాళ్లకు కరెంట్ పెట్టారు. దీంతో అతని చెవులు, నడుము భాగం పనికి రాకుండా పోయింది. మరీ దారుణంగా కటింగ్ ప్లేయర్ తో కండ లాగి కరెంట్ పెట్టి చిత్రహింసలు పెట్టారని.. ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా పోషించుకోలేక పోతున్నట్లు బాధితుడు కన్నీట పర్యంత అయ్యాడు.

మరో యువకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు.. అసలు వీళ్లు పోలీసులా.. లేక మనుషులా అన్న ప్రశ్న తలెత్తేలా ఉంది. హరీశ్ అనే యువకుడు పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నాడు. అతనికి అప్పుడే కొత్తగా పెళ్లైంది. నెరెళ్ల ఘటన జరిగిన రాత్రి ఆ యువకుడిని పోలీసులు ఈడ్చుకెళ్లారు. కొత్తగా పెళ్లైంది అని చెప్పినా వినకుండా అతనికి కరెంట్ పెట్టారు. పోలీస్ అవుదామనుకున్న ఆ యువకుడికి ఇప్పుడు వృత్తే అసహ్యంగా కన్సిస్తోంది. ఇక జీవితంలో పోలీస్ ను కానంటూ చెప్పుకొచ్చాడు. … అధికారం అండగా ఉంటే పోలీసులు ఇంత పాశవికంగా ఎలా ప్రవర్తిస్తారో అనేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాజకీయ నాయకులు మోచేతి నీళ్లు తాగుతూ..వారి అక్రమాలకు, అవినీతికి కాపలా కాసే పోలీస్ వ్యవస్థలో ఎప్పుడు మార్పు వస్తుందో
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)