(వీడియో) విమానం కూలే ముందు ప్రయాణికులు ఎలా ఉన్నారో చూస్తే.. విమానం కూలే ముందు భయం ఎలా ఉంటుందో ఈ వీడియోలో కనిపిస్తుంది

విమానం కూలే ముందు భయం ఎలా ఉంటుందో ఈ వీడియోలో కనిపిస్తుంది. వండర్‌బూమ్‌ ఎయిర్‌ పోర్టు నుంచి నెదర్లాండ్‌కు వెళుతున్న ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటన దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌ వద్ద జరిగింది. 1954లో తయారు చేసిన విమానాన్ని నెదర్లాండ్‌లోని మ్యూజియంకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఫైలెట్, కో ఫైలెట్ సహా మొత్తం 19 ప్రయాణికులు అందులో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక ఇంజనీర్, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే ప్రమాదానికి ముందు అందులోని వ్యక్తి విమాన రెక్కలను వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో రెక్కకు కొంచెం కొంచెంగా మంటలు వ్యాపించడం వీడియోలు స్పష్టంగా కనిపించింది. అయితే కొద్ది సేపటి తరువాత ఆ వీడియో ఆగిపోయింది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగిందని అర్ధమవుతుంది. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలు, కాపాడండంటూ వారిలోని భయం స్పష్టంగా రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Popular Posts

Latest Posts