(వీడియో) అయిదు రోజుల క్రితం పెళ్లి అయింది.. భర్త చేతి మీద వేరే అమ్మాయి పేరు చూసి

భర్త తనకు మాత్రమే సొంతమని భార్య అనుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు..! పుట్టినింటిని వదిలి వచ్చిన భార్యకు భర్తే అన్నీ..! అయితే పెళ్లి అయిన అయిదు రోజులకే భర్త చేతి మీద వేరే అమ్మాయి పేరు పచ్చబొట్టు కనిపించడంతో నవ వధువు అపరకాళీలా తయారైంది. గుడిలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా భర్తను చితక్కొట్టింది. ఆమె భర్త ఏదో చెబుతున్నా కూడా చెవులకు వినిపించుకోలేదు. ఎవరైనా ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆమె వారి మాట కూడా వినలేదు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా..? తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలోని సాయిబాబా ఆలయంలో..! పెళ్లయిన ఐదు రోజులకు సాయిబాబా దర్శనం కోసం గుడికి వచ్చారు. గుళ్ళో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా.. భర్త చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసింది. అది కాస్తా అమ్మాయి పేరు. ఆమె ఎవరంటూ ప్రశ్నించింది. గట్టిగా కేకలు వేస్తూ అతడికి చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా.. జుట్టు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టింది.. చెంపలు చెడామడా వాయించింది. కాళ్లతో తంతూ, వీపుపై పిడిగుద్దులు గుద్దుతూ ఈడ్చుకెళ్లింది. పాపం ఇప్పుడు అతగాడి పరిస్థితి ఎలా ఉందో ఏమో.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)