బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంత వైల్డ్‌గా ఉంటుందా

తెలుగులో బాగా స‌క్సెస్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్‌. హిందీ బిగ్ బాస్ మాదిరిగానే తెలుగులోను ఎన్టీఆర్ హోస్ట్‌గా సీజ‌న్ 1 స్టార్ట్ చేశారు మాటీవీ నిర్వాహ‌కులు. ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో జూన్ 10న నాని హోస్ట్‌గా సీజ‌న్ 2 ప్రారంభ‌మైంది. 16 మంది కంటెస్టెంట్స్‌, 100 రోజులు, 90 కెమెరాలు, ఒక్క బిగ్ బాస్ హౌజ్‌. న‌టి నందిని .. షో మొద‌లైన కొన్నాళ్ల‌కి ఇంటిలోకి స్పెష‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు సంజ‌న‌, నూత‌న్ నాయుడు, కిరిటీ, శ్యామ‌ల , భానుశ్రీ హౌజ్ నుండి ఎలిమినేట్ కావ‌డంతో ప్ర‌స్తుతం ఇంటిలో 12మంది స‌భ్యులు ఉన్నారు. కొద్ది రోజుల నుండి కుమారి 24ఎఫ్ ఫేం హెబ్బా ప‌టేల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాని అంద‌రి ఆలోచ‌న‌ల‌ని త‌ల‌కిందులు చేస్తూ యాంక‌ర్ ప్ర‌దీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వెళ్లారు. ఆయన ఎంట్రీ ఇంటి స‌భ్యుల‌కే షాకింగ్‌గా మారింది. ప్ర‌దీప్‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. మిమ్మ‌ల్ని తొంద‌ర‌గానే పంపిస్తామంటూ హౌజ్‌మేట్స్ చ‌మ‌త్కారం చేశారు. తాజాగా ప్ర‌దీప్ ఎంట్రీకి సంబంధించి ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌దీప్ ర‌చ్చ మాములుగా లేదు. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌దీప్ ఎలా సంద‌డి చేస్తాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)