15 ఏళ్ల స్టూడెంట్‌ని వదలి బతకలేనంటున్న టీచరమ్మ

పదోతరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన మహిళా ఉపాధ్యాయురాలికి రూ.50వేల పూచీకత్తుపై చండీఘడ్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పూనం ఆర్ జోషి బెయిలు మంజూరు చేశారు. చండీఘడ్ కు చెందిన 15 ఏళ్ల విద్యార్థి ప్రభుత్వ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలి ఇంటికి ట్యూషన్ కోసం వచ్చేవాడు. తమ కుమారుడికి టీచరమ్మ వద్ద ట్యూషన్ చెప్పించినా మార్కులు సరిగా రావడం లేదని బాలుడి తల్లిదండ్రులు ఆమె వద్ద ట్యూషన్ మాన్పించారు. తన స్టూడెంట్ ను ట్యూషన్ మాన్పించవద్దని టీచరమ్మ బాలుడి తల్లిదండ్రులను కోరింది. అయినా వారు టీచరమ్మ మాట వినలేదు. దీంతో టీచరమ్మ బాలుడ్ని ఎత్తుకెళ్లి తన ఇంట్లో బంధించింది. స్టూడెంట్ లేకుండా తాను బతకలేనని టీచరమ్మ చెప్పింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పొరుగింటివారి సహకారంతో తమ కుమారుడిని టీచరమ్మ బారి నుంచి కాపాడి తీసుకువెళ్లారు. దీంతో ఆగ్రహం చెందిన టీచరమ్మ బాలుడి ఇంటికి వచ్చి దగ్గుమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీచరమ్మను ఆసుపత్రికి తరలించారు. ఛైల్డ్ హెల్ప్ లైన్ విచారించిన ఈ కేసులో టీచరమ్మ మార్చి నుంచి గత కొన్ని నెలలుగా బాలుడ్ని లైంగికంగా వేధించిందని తేలింది. టీచరమ్మ స్టూడెంట్ కు సిమ్ కార్డు కొనిచ్చి ఆయనతో నిత్యం ఛాటింగ్ చేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు బాలుడ్ని లైంగికంగా వేధించిన టీచరమ్మపై పోస్కో చట్టం సెక్షన్ 6 ప్రకారం కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని స్కూలు టీచరమ్మ బెయిల్ పిటిషన్ సమర్పించడంతో ఆమెకు ఎట్టకేలకు బెయిల్ లభించింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)