పరువు తీయాలని యువతి ఫోన్‌ నెంబర్‌ను పబ్లిక్‌ టాయిలెట్‌ గోడపై రాశాడు.. అంతే.

కోకాపేటకు చెందిన ఓ యువతి క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. రూట్‌ మ్యాప్‌ ప్రకారం తను వెళ్లిన దూరానికి రూ. 200లు చార్జి కాగా.. రూ. 800 ఇవ్వాలని డ్రైవర్‌ డిమాండ్‌ చేశాడు. రూ. 200లు చెల్లించి వెళ్లిపోయింది. ఆమె పరువు తీయాలని భావించిన క్యాబ్‌ డ్రైవర్‌ యువతి ఫోన్‌ నెంబర్‌ను పబ్లిక్‌ టాయిలెట్‌ గోడపై రాసి, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి పలువురు ఆమెకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. విషయం తెలుసుకున్న యువతి షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)