హిందూ దేవాలయంపై కలాం విగ్రహం

రామేశ్వరం నుంచి రాష్టపతి భవనం దాకా అంచెలంచెలు ఎదుగుతూ దేశానికి విశిష్ట ప్రఖ్యాతి తెచ్చిపెట్టిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు మరో గౌరవం దక్కింది. తమిళనాడులో హిందువులు, హిందూ దేవాలయాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రామేశ్వరం దేవాలయంపై కలాం విగ్రహాన్ని చెక్కించారు. గతేడాది జూలై 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబ్దుల్ కలాం విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు కూడా... కలాం కుటుంబ సభ్యులు ఆయన విగ్రహం దగ్గర ఖురాన్, బైబిల్ కూడా ఉంచిన సంగతి తెలిసిందే. విగ్రహంలో భాగంగా ఉన్న భగవత్ గీత మోడల్ పక్కనే వీటిని ఉంచడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే మతవ్యవహారాలపై ఎండీఎంకే చీఫ్ వైకో సహా ఇతర రాజకీయ పార్టీల నేతలు అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అయినప్పటికీ తాజాగా ఆ విమర్శలన్నిటికీ పక్కనపెడుతూ అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏకంగా ఆలయ స్థంభంపై చెక్కడం విశేషం. దేవాలయాలు కేవలం దేవుళ్లకు మాత్రమే కాదనీ... దైవాంశ సంభూతులుగా భావించేవారికి కూడా వీటిలో స్థానం ఉందని చెప్పేందుకే ఇలా చేసినట్టు కనిపిస్తోంది. కాగా అబ్దుల్ కలాంను ఇలా చూడడం అద్భుతంగా ఉందని క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ఇవాళ కైఫ్ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘తమిళనాడులోని రామేశ్వరం దేవాలయంపై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం చెక్కారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయన నిజమైన హీరో. అందరికీ కొండంత స్ఫూర్తి..’’ అని పేర్కొన్నాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)