రేప్ కేసులో బెయిల్..ఆ గ్యాప్ లోనే టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లీ..హనీమూన్

బాలీవుడ్ లో డ్యాన్స్ కింగ్ మిథున్ చక్రవర్తి తనయుడు కొన్ని రోజుల క్రితం మహాక్షయ్ మీద రేప్ కేసు నమోదు కావడంతో నిందితుడుగా ఉన్న అతడిని విచారించేందుకు పోలీసులు పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడంతో వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహాక్షయ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనకు ఇష్టం లేకున్నా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరగా జాతకాలు కలవడం లేదని చెప్తున్నాడని ఫిర్యాదులో వెల్లడించింది. మహాక్షయ్ తల్లి, మిథున్ భార్య యోగితా బాలి కూడా ఇందుకు సహకరించిందని, నువ్వు ఎప్పటికీ నా కోడలివి కాలేవని తనను బెదిరించిందని… యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ బెయిల్ పై ఉన్నారు. ఈ గ్యాప్ లోనే అతడు పెళ్లి చేసుకున్నాడు. ఒకటీ అర తెలుగు సినిమాల్లో కూడా నటించిన హీరోయిన్ మదల్సా శర్మను మహాక్షయ్ ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌ను ఆస్వాదిస్తోంది. వీరు అమెరికాలో విహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మదల్సా ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక ఫొటోను పోస్టు చేసింది. ఈ విధంగా తమ హనీమూన్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది ఆ హీరోయిన్.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)