సెక్స్‌బానిస: ఆచారం ముసుగులో భర్త, మామతో పెళ్లి, మరిదిని కూడ చేసుకోవాలని

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వివాహితపై మోజు తీరాక బలవంతంగా విడాకులిచ్చి ఆమెకు మామతోనే వివాహం చేశారు.ఆమెపై మోజు తీరిన తర్వాత అతను కూడ మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. 'నిఖా హలాలా ' ఆచారం ముసుగులో ఓ వివాహితను సెక్స్ బానిసగా ఉపయోగించుకొన్న ఉదంతం వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఓ మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. అయితే ఆమెపై మోజు తీరిన తర్వాత విడాకులు ఇచ్చేశాడు. అయితే బాధితురాలికి న్యాయం చేస్తామని ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులను నమ్మించారు. 'నిఖా హలాలా' కార్యక్రమంలో భాగంగా మరో వ్యక్తితో బాధితురాలికి వివాహం చేస్తామని వాగ్ధానం చేశారు. అయితే మరో వ్యక్తికి బదులుగా మొదటి భర్త తండ్రికే ఆమెను ఇచ్చి వివాహం చేశారు. అంతేకాదు బలవంతంగా అతడితో కాపురం చేయించారు. కోడలిని వివాహం చేసుకొన్న మామ... కొన్నాళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. అయితే తిరిగి మొదటి భర్తతో వివాహం జరిపిస్తామని హమీ ఇచ్చారు. దీంతో మౌనంగా ఈ బాధలను భరించింది. మొదటి భర్త వద్దకు వెళ్లాలనుకొన్న సమయంలో ఆ కుటుంబం మరోసారి బాధితురాలికి అన్యాయం చేసింది. మొదటి భర్త కుటుంబం మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. మొదటి భర్త సోదరుడిని వివాహం చేసుకోవాలని కోరింది. దీంతో బాధితురాలు తనకు అన్యాయం జరిగిందనే విషయం అర్ధం చేసుకొంది. మరిదిని వివాహం చేసుకోకపోతే మతం నుండి బహిష్కరిస్తామని కుటుంబసభ్యులు హెచ్చరించారు. దీంతో తలాక్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధుల సహాయాన్ని బాధితురాలు కోరింది. స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధుల కోరిక మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)