మీతో డేటింగ్‌కి ప్రముఖ నేతలు, బిజినెస్ మెన్ సిద్ధం.. మీరు ఓకే అంటే ఒక్క రాత్రికి రూ.30 లక్షలు

ప్రస్తుతం సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ పెద్ద చర్చగా మారింది. ప్రతీఒక్క ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీమణులు దీని గురించి పెదవి విప్పుతున్నారు. ఇండస్ట్రీలోనే ఇలా ఉందా అంటే వీరికి బయటి నుంచి కూడా వేధింపులు తప్పట్లేదు. దాదాపు 30కి పైగా సిినిమాల్లో నటించి తమిళనాట మంచి పేరు సంపాదించుకున్న కోలీవుడ్ నటి జయలక్ష్మికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఈ మ‌ధ్య త‌ర‌చు తన ఫోన్‌లో లైంగిక వేధింపులు వ‌స్తున్నాయ‌ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ‘మీరు మంత్రులు, వీఐపీలతో డేటింగ్ చేయాలనుకుంటున్నారా? కింద పేర్కొన్న రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్‌కు ఫోన్ చేయండి. రోజుకు రూ.30వేల నుంచి రూ.3లక్షలు తేలిగ్గా సంపాదించుకోవచ్చు’ అని ఆ మేసేజ్‌లో ఉంది. ఇలాంటి మెసేజ్‌లను కొంతకాలం భరించిన ఆమెకు ఈసారి ఏకంగా కాల్స్ రావ‌డం మొద‌లు పెట్టాయి. మీతో గ‌డిపేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, బిజినెస్ మ్యాన్లు సిద్ధంగా ఉన్నారని మీరు ఓకే అంటే రూ.30 లక్షలు అడ్వాన్స్ ఇస్తామంటూ చెప్పారు. దీంతో ఆమె చెన్నై పోలీసులను కలిసి కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు బ్రోకర్ల సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)