పాలిస్తూ.. ఫొటో ‘షేర్‌’చేసింది

గతంలో ఓ చంటిబిడ్డకు చనుబాలిస్తూ.. ఓ మోడల్, గృహలక్ష్మి అనే మలయాళం మేగజైన్ కవర్‌పేజీ ఫొటోకు ఫోజిచ్చింది. అప్పట్లో అది పెను దుమారం రేపింది. అయితే, ఈ తరహాలోనే అమెరికాకు చెందిన మోడల్ బిడ్డకు పాలిస్తున్న ఫొటోను షేర్ చేసింది. అమెరికాకు చెందిన క్రిస్సీ టైజిన్ తన బిడ్డకు పాలిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఒక్క రోజులోనే ఈ ఫొటోకు 30 లక్షలకు పైగా లైకులు, 40 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. చాలామంది నెటిజన్లు ఈ ఫొటోను వేలల్లో షేర్ చేశారు. నేను చనుబాలిస్తుంటే.. లూనా నా దగ్గరకొచ్చి తన బొమ్మకు కూడా పాలివ్వమంది. దీంతో ఇప్పుడు నాకు కవల పిల్లలు ఉన్నారనే భావన కలుగుతున్నది అని బొమ్మకు కూడా పాలిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను క్రిస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటోపై కొంతమంది నెటిజన్లు పాజిటివ్‌గా, మరికొంతమంది నెగెటివ్‌గా కామెంట్ చేశారు. పాశ్చాత్య దేశాల్లో సెలబ్రిటీలు ఇలా ఫొటోలు పోస్టు చేయడం సర్వ సాధారణమే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)