రేప్ చేసి గుళ్ళోకి తీసుకెళ్ళి అక్కడ యజ్ఞంలో సజీవదహనం చేశారు

సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవడమే కాదు...జరిగిన ఘోరం చూసి ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 35 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆ తర్వాత ఆమెను సమీపంలోని ఆ ఆలయ యజ్ఞశాలతో సజీవదహనం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా రాజ్‌పుర పోలీసు స్టేషన్ సమీపంలోని ఓ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. బాధిత మహిళకు గజియాబాద్‌లో కూలీగా పని చేస్తున్న భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బాధిత మహిళ ఇంట్లో పరుండి ఉండగా లోపలకు చొరబడిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం పాశవికంగా నిప్పుపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి భర్త కన్నీరుమున్నీరయ్యాడు. 'తెల్లవారుజామున 2.30 గంటలకు నా భార్య ఒంటరిగా నిద్రిస్తుండటం చూసిన దుండగులు నా ఇంట్లో చొరబడి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ విషయాన్ని నా భార్య తన కజిన్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసే లోపే అత్యాచారానికి ఒడికట్టిన దుండగులు మళ్లీ ఇంట్లోకి చొరబడి నా భార్యను ఈడ్చుకుంటూ సమీపంలోని ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి యజ్ఞశాల వద్ద ఆమెకు నిప్పుపెట్టారు' అంటూ మృతురాలి భర్త పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, నిందితులను ఆరామ్ సింగ్, మహావీర్, చరణ్ సింగ్, గుల్లు, కుమార్‌పాల్‌గా గుర్తించామని, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని రాజ్‌పుర స్టేషన్ హైస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి కీలక ఆధారాలు లభ్యమైనట్టు ఏడీజీపీ ప్రేమ్ ప్రకాష్ చెప్పారు. మృతురాలు చివరిసారిగా తన కజిన్‌కు ఫోన్ చేసిన ఆడియో క్లిప్ సేకరించామని, నిందితులను పట్టుకోవడానికి ఎంతో సమయం పట్టదని ఆయన వివరించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)