రాంగోపాల్ వర్మ దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య

బాలీవుడ్ సినీ రచయిత, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అయిన రవిశంకర్ అలోక్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 32 ఏళ్ళ ఈయన ముంబై వెస్ట్ అంధేరీలో ఉన్న తన నివాసంలోని ఏడో అంతస్తునుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇతని నివాసంలో ఎలాంటి సూసైడ్‌నోట్ లభించలేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. సుమారు ఏడాదికాలంగా మానసిక ఒత్తిడితో బాధ పడుతున్న తన సోదరుడు… ఇందుకు చికిత్స కూడా తీసుకుంటున్నాడని అలోక్ బ్రదర్ తెలిపాడు. 2004లో నానా పటేకర్ నటించిన ‘అబ్ తక్ ఛప్పన్’ మూవీకి అలోక్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా పాపులర్ అయ్యాడు. భూత్ రిటర్న్స్ వంటి రాంగోపాల్ వర్మ చిత్రాలకు కూడా అలోక్ పని చేశాడు. ది టికెట్, ఖులీ ఖిడ్‌కీ వంటి లఘు చిత్రాలకు అలోక్ దర్శకత్వం వహించాడు. వీటిలో బాలలపై తీసిన ది టికెట్ షార్ట్ ఫిలింని 2012లో లడఖ్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. అలాగే ఖులీ ఖిడ్ కీ.. 2013లో షికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికయింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)